ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుద్రోత్సవ సేవలో బీద రవిచంద్ర

ABN, First Publish Date - 2020-12-31T03:22:15+05:30

మండలంలోని ఇస్కపల్లిలో వెలసిన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి బుధవారం ఆరుద్రోత్సవ సేవ నిర్వహించారు.

స్వామివారి పల్లకీ సేవలో బీద సోదరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, డిసెంబరు 30 : మండలంలోని ఇస్కపల్లిలో వెలసిన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి బుధవారం ఆరుద్రోత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఆయన సోదరుడు బీద గిరిధర్‌ పాల్గొన్నారు. దేవదేవుడు పరమశివుడి జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం కావడం మార్గశిర మాసంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేష పూజలు చేపట్టిన అనంతరం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. వేకువజామున రుద్రాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర, బీద గిరిధర్‌లు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Updated Date - 2020-12-31T03:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising