ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ దీక్ష

ABN, First Publish Date - 2020-11-01T11:27:30+05:30

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్‌ అధికార్‌ దివస్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ శనివారం నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద నిరసన దీక్ష చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వైద్యం) అక్టోబరు 31 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ  కిసాన్‌ అధికార్‌ దివస్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ శనివారం నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద  నిరసన దీక్ష చేపట్టింది. డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి సహకారంతో చేసిన దీక్షలో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఏటూరి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని విమర్శించారు. పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపటం సరికాదన్నారు.


రైతులపై ఏమాత్రం గౌరవం ఉన్నా కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన 2 కోట్ల సంతకాల ఉద్యమంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాల పాలనలో మహిళలు, దళితులు, ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షలో డీసీసీ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్‌, సిటీ ఇన్‌చార్జ్‌ షేక్‌ ఫయాజ్‌, కొండా అనిల్‌కుమార్‌, పప్పర్తి గణేష్‌బాబు, కరీముల్లా, హుస్సేన్‌బాషా, రాంప్రసాద్‌, ఫాజిల్‌, మణి, మోహన్‌రెడ్డి, సర్పరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T11:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising