ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి జీజీహెచ్‌లో వైద్యసేవలు

ABN, First Publish Date - 2020-10-28T10:45:35+05:30

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్‌) గురువారం నుంచి సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరోనా బాధితులకు, సాధారణ రోగులకు వేర్వేరుగా ఏర్పాట్లు

 అధికారుల సమీక్షలో జేసీ ప్రభాకర్‌రెడ్డి


నెల్లూరు (వైద్యం) అక్టోబరు 27 : నెల్లూరులోని ప్రభుత్వ  సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్‌) గురువారం నుంచి సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జీజీహెచ్‌లో అధికారులతో సమీక్షించారు.  కరోనా రోగులతోపాటు సాధారణ రోగాలకు ఇక నుంచి వైద్య చికిత్సలు అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని  సూచించారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని 3, 4 ఫ్లోర్‌ లలో కరోనా బాధితులకు పేమెంట్‌ గదులు కేటాయించాలన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్లలో నాన్‌ కొవిడ్‌ వార్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కరోనా బాధితులు ఆసుపత్రి ముందువైపు నుంచి, సాధారణ రోగులు వెనుక వైపు నుంచి వచ్చేలా ఏర్పాట్లు  చేయాలన్నారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో కొవిడ్‌ బాధితులకు, క్యాజువ్యాలిటీలో నాన్‌ కోవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే వైద్యులు, సిబ్బందిని కూడా కోవిడ్‌, నాన్‌ కోవిడ్‌ బాధితులకు విడివిడిగా వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆహార పంపిణీ కూడా విడివిడిగా జరగాలని సూచించారు. వైద్య నిఫుణుల వివరాలు రోగులకు తెలిసేలా తగిన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సమీక్షలో ఆసుపత్రి సూపరింటెండెండ్‌ సుధాకర్‌రెడ్డి, అడ్మినిస్ట్రేషన్‌ డాక్టర్‌ కళారాణి, వైద్యులు సుబ్రహ్మణ్యం,  అనూరాధ, నిర్మలాదేవి, వర్మ, మస్తాన్‌బాష తదితరులు పాల్గొన్నారు.


 76 కేసుల నమోదు

జిల్లాలో మంగళవారం 76 పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,724లకు చేరుకుంది. ఒక కరోనా నుంచి కోలుకున్న 196 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. 

Updated Date - 2020-10-28T10:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising