ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం రోజుల్లో పంట నష్ట పరిహారం

ABN, First Publish Date - 2020-10-27T07:35:10+05:30

జిల్లాలో ఇటీవల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు వారం రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రబీ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు సిద్ధం

 కలెక్టర్‌ చక్రధర్‌ బాబు


సంగం, అక్టోబరు 26: జిల్లాలో ఇటీవల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు వారం రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన  సంగం -1 సచివాలాయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాలు, వరదలకు సుమారు 576 హెక్టార్లలో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. 33 శాతం కంటే ఎక్కువ భాగం పంట దెబ్బతింటే నష్ట పరిహారం కింద గుర్తించడం జరిగిందని తెలిపారు. నష్టపోయిన వారి జాబితాలో పేర్లు లేకుంటే వారం రోజుల్లో నమోదు చేయించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 5.5 కోట్ల పంట నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి  నివేదికలు పంపామని తెలిపారు. ఇక రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఉన్నాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేయడానికి 273 గోదాముల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు నిర్మలానందబాబా, ఏవో శ్రీహరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T07:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising