జగనన్న విద్యాకానుక మళ్లీ వాయిదా
ABN, First Publish Date - 2020-10-04T07:23:13+05:30
జగనన్న విద్యాకానుక మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీ విద్యార్థులకు కానుక అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఆ మేరకు పాఠశాలకు అందిన అరకొర వస్తువులను ఉపాధ్యాయులు కొద్ది రోజులుగా ప్యాక్ చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో అందని సామగ్రి
యూనిఫాంపైనే తల్లిదండ్రుల పెదవి విరుపు
కుట్టుకూలి రూ.40 ఇవ్వడంపై అసహనం
నెల్లూర్డు (స్టోన్‌హౌ్‌సపేట), అక్టోబరు 3 : జగనన్న విద్యాకానుక మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీ విద్యార్థులకు కానుక అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఆ మేరకు పాఠశాలకు అందిన అరకొర వస్తువులను ఉపాధ్యాయులు కొద్ది రోజులుగా ప్యాక్ చేస్తున్నారు. కానుక కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచి చూస్తున్న తరుణంలో మళ్లీ వాయిదా పడిందని తెలియడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో అందని కానుకలు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి జగనన్న విద్యాకానుక ఇవ్వాలని రాష్ట్ర ప్రభ్వుతం భావించింది. ఇందులో భాగంగా 2,51,657 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు ఇవ్వాల్సి ఉండగా 2,51,027 బ్యాగ్స్ జిల్లాకు చేరగా మరో 630 బ్యాగ్స్ రావాల్సి ఉంది. ఇక 2,25,657 బూట్లకు 2,43,467, 1,86,544 బెల్టులకు 1,85,734, 14,10,386 నోట్‌బుక్స్‌లకు 12,27,600 వచ్చాయి. ఇక ఒకటి నుంచి 8వ తరగతి వరకు 2,04,790 యూనిఫాం రావాల్సి ఉండగా 2,04,740 వచ్చాయి. 9,10 తరగతుల విద్యార్థులకు 46,867 యూనిఫాం రావాల్సి ఉండగా 17,354 మాత్రమే జిల్లాకు చేరాయి.
జతకు రూ.40 కుట్టుకూలినా..!?
ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థుల యూనిఫాం ప్రభుత్వమే కుట్టించి అందజేస్తోంది. అయితే ఈ విద్యాసంవత్సరంలో మాత్రం జగనన్న విద్యాకానుకలో యూనిఫాం వస్త్రాన్ని ఇస్తారు. తల్లిదండ్రులే ఆ వస్త్రాన్ని కుట్టించి విద్యా ర్థులకు ఇవ్వాలి. అయితే, ఇందుకుగాను కుట్టుకూలి కింద జతకు ప్రభుత్వం రూ.40 అందజేస్తోంది. ఇది ఎక్కడ సరిపోతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇచ్చే అరకొర నగదు కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు.
Updated Date - 2020-10-04T07:23:13+05:30 IST