ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 నుంచి మనం-మన పరిశుభ్రత కార్యక్రమం

ABN, First Publish Date - 2020-10-01T09:15:27+05:30

గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2వ తేదీ నుంచి రెండో విడత మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. బుధవారం పొదలకూరులోని బిట్‌-1 సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ చక్రధర్‌బాబు


పొదలకూరు, సెప్టెంబరు 30 : గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2వ తేదీ నుంచి రెండో విడత మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. బుధవారం పొదలకూరులోని బిట్‌-1 సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో మన పరిశుభ్రత కార్యక్రమం సక్సెస్‌ అయిందని, రెండో విడతగా 284 పంచాయతీల్లో అమలు చేయనున్నట్లు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.


త్వరలో ఓడీఎ్‌ఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా రూపుదిద్దుకునే లక్ష్యంతో పని చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కొవిడ్‌-19పై ఏఎన్‌ఎంలు, మండల వైద్యాధికారులు ప్రతి ఇంటిని సందర్శించి పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 80 శాతం ధాన్యాన్ని సేకరించామన్నారు. రైతులను మోసగిస్తే మిల్లర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


గ్రామ వలంటీర్లతో మాట్లాడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరుతెన్నులు, సమస్యలను ఆరా తీశారు. కార్యక్రమంలో డీపీవో (జిల్లా పంచాయతీ అధికారి) ధనలక్ష్మీ, డీఎల్‌పీవో కృష్ణమోహన్‌, తహసీల్దారు స్వాతి, ఎంపీడీవో నారాయణరెడ్డి, ఏపీఎం వనజాక్షి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కసానాయక్‌, సివిల్‌ సప్లయ్‌ డీటీ రవి, సొసైటీ చైర్మన్‌ మోపూరు శ్రీనివాసులురెడ్డి, వీర్‌వోలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T09:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising