ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 415 పాజిటివ్‌లు

ABN, First Publish Date - 2020-10-01T08:56:42+05:30

కరోనా మహమ్మారి నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండగా, మరణాల రేటు అదేస్థాయిలో ఉంటోంది. తాజాగా బుధవారం 415 పాజిటివ్‌లు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒకరి మృతి.. 358 మంది డిశ్చార్జ్‌

నెల్లూరు (వైద్యం)సెప్టెంబరు 30 : కరోనా మహమ్మారి నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండగా, మరణాల రేటు అదేస్థాయిలో ఉంటోంది. తాజాగా బుధవారం 415 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,901కి చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకోలేక ఒకరు మృతి చెందారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నెల్లూరు, నారాయణ ఆసుపత్రి, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి 358 మంది డిశ్చార్జ్‌ చేశారు.


 ప్లాస్మాదానంలో జిల్లాకు మొదటిస్థానం

రాష్ట్రంలోనే ప్లాస్మాదానంలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు. బుధవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ప్లాస్మాదానం చేస్తున్న దాతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సంస్థలోనే సుమారు 380 మంది నుంచి ప్లాస్మా సేకరణ చేపట్టారన్నారు. మిగతా ఆసుపత్రుల నుంచి 300 మంది వరకు ప్లాస్మాదానం చేశారన్నారు.


జీజీహెచ్‌లో ఎవరికి రక్తం అవసరమైనా రెడ్‌క్రాస్‌ సరఫరా చేస్తుందని తెలిపారు. అనంతరం ప్లాస్మాదాత ఉదయ్‌కిరణ్‌కు ప్రోత్సాహక చెక్‌ను అందచేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండ్‌ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T08:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising