ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార దుర్వినియోగంతో..గెలవాలని జగన్‌ యత్నం

ABN, First Publish Date - 2020-03-08T09:56:27+05:30

పోలీసు వ్యవస్థను, అధికారు లను చెప్పుచేతల్లో పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ  బీజేపీ  అధ్యక్షుడు


సూళ్లూరుపేట, మార్చి 7 : పోలీసు వ్యవస్థను, అధికారు లను చెప్పుచేతల్లో పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని,  ఆయన కుయుక్తులను తాము అడ్డుకుంటామని తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి చెప్పారు. సూళ్లూరుపేట లోని ఓ హోటల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జనసేనతో కలసి పోటీ చేస్తుందన్నారు.


రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారు..

జగన్‌ పాలన వల్ల ఏడు మాసాలకే  రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు.  ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం అమలుచేయలేదన్నారు. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్ర నిధులతో గాని జరిగిందేనన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిరాగానే ప్రజావేదికను కూల్చేశాడని, అప్పటి నుంచే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు.


మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.  ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ కోసం విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోని నియంత జగన్‌ అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓట్లేసి గెలిపించాలన్నారు.  సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరణి విజయ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పులుగు శ్రీనివాసులురెడ్డి, స్థానిక నేతలు తన్నీరు శేషగిరిరావు, సోమశేఖర్‌రెడ్డి, బూరగ మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T09:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising