ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ప్రాణాలంటే లెక్కలేదా?

ABN, First Publish Date - 2020-07-13T19:53:51+05:30

మేం కరోనాతో అల్లాడుతుంటే మూడు రోజులకు ఒకసారి వైద్యులు వస్తారా..? అంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు రోజులకొకసారి వైద్యులు వస్తారా?

ఆహారం ఆలస్యంగా ఇస్తున్నారు

బాధితుల ఆందోళన


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): మేం కరోనాతో అల్లాడుతుంటే మూడు రోజులకు ఒకసారి వైద్యులు వస్తారా..? అంటూ నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల తరువాత ఆదివారం కరోనా వార్డు బయట ఉన్న వైద్యురాలిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా మూడు రోజుల తర్వాత రావటం ఏమిటంటూ ప్రశ్నించారు. మందులు సక్రమంగా అందచేయటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలితో వాగ్వివాదానికి దిగారు. ఇదిలా ఉంటే స్వయానా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించినా తమకు మధ్యాహ్నం 3 గంటలపైన, రాత్రి 10.30 గంటల తర్వాత ఆహారం అందిస్తున్నారని బాధితులు వాపోయారు. ఉదయం అందచేసే అల్పాహారంలో నాణ్యత ఉండటం లేదంటూ వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము కరోనా నుంచి ఎలా కోలుకుంటామంటూ నిరసన తెలిపారు.

Updated Date - 2020-07-13T19:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising