త్వరలో రైళ్లు పునరుద్ధరణ
ABN, First Publish Date - 2020-12-12T03:44:28+05:30
బిట్రగుంట రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు.
బిట్రగుంట, డిసెంబరు 11: బిట్రగుంట రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా రద్దు చేసిన రైళ్లను త్వరలో పునరుద్ధరించేందుకు రైల్వే అ ధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు. రైలు ప్రవేశ ద్వారం వద్ద కూర్చొని ప్రయాణించకూడదన్నారు. రైల్వే గేటు వేసిన సమయంలో ప్రజలు అజాగ్రత్తగా రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆయన వెంట నెల్లూరు సీఐ శ్రీనివాసమూర్తి, కావలి ఎస్సై మాలకొండయ్య, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2020-12-12T03:44:28+05:30 IST