మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ABN, First Publish Date - 2020-05-09T08:35:18+05:30
చేపల వేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబసభ్యులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేట టౌన్, మే 8 : చేపల వేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబసభ్యులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శుక్రవారం పరామర్శించారు. పెళ్లకూరు మండలం పాలచ్చూరు గ్రామంలో గురువారం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రసాద్, చంద్రయ్య మృతిచెందారు. వారి మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవయ్య శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి త్వరితగతిన కుటుంబసభ్యులకు అప్పగించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆయన వెంట మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, కాటంరెడ్డి మల్లికార్జున్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - 2020-05-09T08:35:18+05:30 IST