‘స్వర్ణభారత్’లో శాసన మండలి ఛైర్మన్
ABN, First Publish Date - 2020-12-30T04:21:06+05:30
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సారథ్యంలో ఆయన కుమారై దీపావెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అభినందించారు.
వెంకటాచలం, డిసెంబరు 29 : భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సారథ్యంలో ఆయన కుమారై దీపావెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అభినందించారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ను మంగళవారం రాత్రి ఆయన శాసన మండలి సభ్యులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లాభాలు ఆశించకుండా వెంకయ్యనాయుడు, ఆయన కుమారై చేస్తున్న సేవలు అదర్శనీయమని ప్రశంసించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, కత్తి నరసింహారెడ్డి, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, స్వర్ణభారత్ ట్రస్ట్ సమన్వయకర్త జనార్దన్‌రాజు ఉన్నారు.
Updated Date - 2020-12-30T04:21:06+05:30 IST