ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌.. డోంట్‌ కేర్‌ !

ABN, First Publish Date - 2020-08-10T10:46:43+05:30

కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సూళ్లూరుపేటలో ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు అధికారులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యథావిధిగా మద్యం దుకాణాలు


సూళ్లూరుపేట, ఆగస్టు 9 : కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సూళ్లూరుపేటలో ఆదివారం ఉదయం 6  నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. పాలు, మెడికల్‌ షాపులు తప్ప మిగిలిన అన్ని దుకాణాలు మూసివేయాలని ప్రచారం చేశారు. అయితే పట్టణంలోని అన్ని మద్యం షాపులు తెరచి విక్రయాలు సాగిస్తున్నా అధికారులు కళ్లుమూసుకున్నట్లు ఉండిపోయారు. షార్‌రోడ్డులో తలుపులు వేసుకుని చాటుమాటుగా చేపలు అమ్ముకుంటున్న ఓ దుకాణందారులను పోలీసులు బెదిరించి మూసివేయించారు. అక్కడికి కూతవేటు దూరంలో వె ౖసర్కిల్‌ వద్ద మద్యం షాపు వద్ద జనం ఉన్నా  పోలీసులకు కనిపించలేదు. 


పట్టణంలో మద్యం దుకాణాలన్నీ తెరిచివుండటంతో ఆంధ్రజ్యోతి మున్సిపల్‌ కమిషనర్‌, ఎస్‌ఐకి ఫోన్‌చేయగా అవి ప్రభుత్వ దుకాణాలు కదండీ.. ఏమి చేయగలం...? అంటూనే ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళతామంటూ సమాధానం ఇచ్చారు.  ఇలా మధ్యాహ్నం ఒంటిగంట వరకు మద్యం అమ్మిన దుకాణాల వద్దకు  పోలీసులు వచ్చి షాపులను  మూసివేయించారు.  స్థానిక సీఐ వెంకటేశ్వర్లురెడ్డి ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడి మద్యాహ్నం నుంచి షాపులను మూసివేయించినట్లు సమాచారం. పోలీసులు అటు వెళ్లగానే మళ్లీ మద్యం షాపులన్ని తెరిచారు.

Updated Date - 2020-08-10T10:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising