ప్రభుత్వ విధానాలతో డెల్టా రైతులకు కష్టాలు
ABN, First Publish Date - 2020-12-16T03:49:59+05:30
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో డెల్టా రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
కోవూరు, డిసెంబరు 15: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో డెల్టా రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల్ని ఇబ్బందులకు గురిచేసి అధికార వైసీపీ నాయకులు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. చారిటబుల్ ట్రస్టు పేరుతో లక్షలాది రూపాయల్ని కొల్లగొట్టారని విమర్శించారు. రైతులెవ్వరూ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను కోర్టులు తిరస్కరించాయని చెప్పారు. రూ.పదివేల కోట్లతో అమరావతి ప్రజానిధుల్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి అధ్యక్షత వహించిన సభలో నాయకులు సన్నపురెడ్డి వేణుగోపాలరెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, బాలా రవి, ముసలి సుధాకర్, గౌతమ్, మునిరత్నం, జెట్టి రాజగోపాలరెడ్డి, నరేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
Updated Date - 2020-12-16T03:49:59+05:30 IST