ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కింటియా’ భూములు స్వాధీనం

ABN, First Publish Date - 2020-11-25T04:52:13+05:30

చిల్లకూరు మండలం మోమిడి, తమ్మినపట్నం గ్రామాల పరిధిలో కింటియా పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు కేటాయించిన 840.76 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌ ప్రాజెక్టు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం


నెల్లూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : చిల్లకూరు మండలం మోమిడి, తమ్మినపట్నం గ్రామాల పరిధిలో కింటియా పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు కేటాయించిన 840.76 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఏపీఐఐసీకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2009లో కింటియా పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తమ్మినపట్నం, మోమిడి ప్రాంతంలో 1080 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల వపర్‌ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఈ సంస్థకు 840.76 ఎకరాలను కేటాయించింది. సుమారు రూ.2997 కోట్ల పెట్టుబడి పెడుతూ 600 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. రెండేళ్లలో పనులు ప్రారంభించాల్సి ఉన్నా ఇప్పటికీ పురోగతి లేదు. దీంతో పలుమార్లు ప్రభుత్వం కింటియా పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయినా పురోగతి లేకపోవడంతో నిబంధనల ప్రకారం తిరిగి భూములను స్వాధీనం చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ కింటియా సంస్థకు అప్పగించిన భూములను స్వాధీనం చేసుకొని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.  

Updated Date - 2020-11-25T04:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising