శ్రీ పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
ABN, First Publish Date - 2020-12-16T03:45:21+05:30
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ట్రంకురోడ్డు వద్ద ఉన్న అమరజీవి విగ్రహానికి మంగళవారం పలువులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కావలిటౌన్, డిసెంబరు 15: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ట్రంకురోడ్డు వద్ద ఉన్న అమరజీవి విగ్రహానికి మంగళవారం పలువులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైసీపీ కార్యాలయంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సావనీరును ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, అమరా వేదగిరి, జగదీ్‌షరెడ్డి, తిరివీధి ప్రసాద్, చీదెళ్ల కిషోర్, మామిడి రామకృష్ణ, రమేష్, గంధం ప్రసన్న, జీ వెంకటేశ్వర్లు, నాగాచారి, రాజు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట నాయకులు గ్రంధి యానాది శెట్టి, జ్యోతి బాబురావు, సప్తగిరి సుబ్బారావు, దామా మాల్యాద్రి, పద్మనాభరెడ్డి, జ్వాల చంద్ర, మస్తాన్, నాగేశ్వరావు, వెంగళరెడ్డి, శానం హరి పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ మరో వర్గం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పీ. అలేఖ్య, నాయకులు మన్నవ రవిచంద్ర, మధుబాబు నాయుడు, గుత్తికొండ కిషోర్, శ్రీహరినాయుడు, మొగిలి కల్లయ్య, తటవర్తి వాసు, చవల రామకృష్ణ, కుమార్, మంచాల ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే బ్రహ్మానందం, పరుసు వెంకటేశ్వర్లు, పాలడుగు సుభాషిణి, ఎం వెంకటేశ్వర్లు, సుజీ, కేసరి మురళి, మందా కిరణ్ తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్పీడీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కాపీఎం కాంతారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T03:45:21+05:30 IST