ఘనంగా కార్తీక మాస వేడుకలు
ABN, First Publish Date - 2020-12-02T05:36:39+05:30
నెల్లూరులోని శివాలయాల్లో కార్తీక మాసం వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మూలస్థానేశ్వరాలయంలో ఉదయం పాలాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు జరిగాయి.
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 1 : నెల్లూరులోని శివాలయాల్లో కార్తీక మాసం వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మూలస్థానేశ్వరాలయంలో ఉదయం పాలాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు జరిగాయి. సాయంత్రం పూలంగిసేవ, ప్రాకారోత్సవం, కార్తీక దీపోత్సవం జరిగాయి. ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో బుధవారం రాత్రి అన్నాభిషేకం జరుగుతుందని ఆలయ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
వాత్సల్యలో కార్తీక దీపోత్సవం
నెల్లూరు(హరనాథపురం); డిసెంబరు 1 : నగరంలోని వాత్సల్య ఆనాథ శరణాలయంలో మంగళవారం కార్తీక దీపోత్సవం జరిగింది. విద్యార్ధులు శివలింగానికి అలంకరణచేసి, 375 ప్రమిదలను ఏర్పాటు చేసి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో జనహిత- వాత్సల్య ఆర్గనైజింగ్ కార్యదర్శి జీవీ సాంబశివరావు, కేఎం శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T05:36:39+05:30 IST