ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత్రికేయులకోసం వెబ్‌సైట్‌

ABN, First Publish Date - 2020-12-29T05:07:00+05:30

పాత్రికేయులకు ఉపయోగపడే విధంగా త్వరలో ప్రెస్‌ అకాడమీ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ తెలిపారు.

మాట్లాడుతున్న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనాథ్‌


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 28 : పాత్రికేయులకు ఉపయోగపడే విధంగా త్వరలో ప్రెస్‌ అకాడమీ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ తెలిపారు. ఆయన సోమవారం తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలో నెల్లూరు ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తుందని, అందులో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తారని చెప్పారు. వృత్తిపరంగా జర్నలిస్టులు ఆ వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిజంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా ప్రెస్‌ అకాడమీ తరపున ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రెండో విడతలో ప్రత్యక్షంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రెస్‌ అకాడమీ తరపున ముద్రించిన 12 పుస్తకాలను త్వరలో పాత్రికేయులకు పంపిణీ చేస్తామన్నారు. 

Updated Date - 2020-12-29T05:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising