వైభవంగా కామాక్షితాయికి నరక చతుర్ధి పూజలు
ABN, First Publish Date - 2020-11-14T02:35:28+05:30
మండలంలోని జొన్నవాడ ఆలయంలో శుక్రవారం నరకచతుర్ధి పూజలు ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.
బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 13: మండలంలోని జొన్నవాడ ఆలయంలో శుక్రవారం నరకచతుర్ధి పూజలు ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో గంగా, కామాక్షితాయి సమేతంగా మల్లికార్జునస్వామి ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు గుండ్లపాళెంకు చెందిన వీ. మల్లికార్జునరావు కుటుంబం ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యుడు మధుసూదన్‌రెడ్డి, సూపరింటెండెంట్ గిరికృష్ణ పర్యవేక్షించారు. అంతేకాకుండా జొన్నవాడ ఆలయానికి చెందిన భూములు, రూములకు శుక్రవారం వేలంపాటలు జరిగాయి. ఈ వేలం పాటల్లో ఆలయ కమిటీ సభ్యులు, గుమ్మా ప్రమీలమ్మ, పర్యవేక్షణాధికారి శ్రీలత, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్, సూపరింటెండెంట్ గిరికృష్ణ, సీనియర్ సహాయకుడు రంగరాజు పాల్గొన్నారు.
కామాక్షితాయికి వైభవంగా సామూహిక కుంకుమార్చన
మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో శుక్రవారం కామాక్షితాయికి సామూహిక కుంకుమార్చన వైభవంగా జరిగింది. లలితా సహస్ర నామార్చనతో నిర్వహించిన ఈ కుంకుమార్చనలో ఆలయానికి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు పూజలను పర్యవేక్షించారు.
Updated Date - 2020-11-14T02:35:28+05:30 IST