ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2020-08-10T10:47:57+05:30

గిరిజనుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆదివాసీ దినోత్సవంలో జేసీ వినోద్‌కుమార్‌


నెల్లూరు (వీఆర్సీ), ఆగస్టు 9 : గిరిజనుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. నెల్లూరులోని బీవీనగర్‌ గిరిజన భవన్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిఽథులుగా జేసీ, ఇన్‌చార్జి జేసీ శీనానాయక్‌ హాజరయ్యారు. వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ గిరిజనులు స్వతహాగా మృదు స్వభావులని, మంచి మనసు ఉన్నవార ని తాను ఐటీడీఏలో పనిచేసిన సందర్భంలో గమనించానన్నారు. జిల్లాలో గిరిజన యువత కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు.


యువత అలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుంటే ఆదాయ వనరులు మెరుగుపడతాయన్నారు. పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనులకు నేటికీ కొన్ని ప్రాంతాల్లో ఆధార్‌, రేషన్‌ కార్డులు లేవని జేసీ దృష్టికి తీసుకురాగా జిల్లాలో అలాంటి వారిని గుర్తించి తక్షణమే రేషన్‌, ఆధార్‌ కార్డులను అందిస్తామని జేసీ హామీ ఇచ్చారు. అనంతరం ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ పఽథకం ద్వారా ఎంపికైన ఇద్దరికి రూ.10.60 లక్షల విలువైన రెండు బొలెరో వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మణికుమార్‌, డీటీడబ్ల్యూవో విద్యారాణి, గిరిజన నాయకులు కేసీ పెంచలయ్య, పులి చెంచయ్య, కార్యాలయ సిబ్బంది నవీన్‌కుమార్‌, అంకయ్య, రమేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising