ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులకు తక్షణ సాయమందించాలి

ABN, First Publish Date - 2020-12-08T02:33:19+05:30

తుఫాన్‌ కారణంగా మండలంలో నీటమునిగి నారుమళ్లు, వరినాట్లు, మెట్టపైర్లు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే తక్షణ సా

నిరసన చేపట్టిన జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు7: తుఫాన్‌ కారణంగా మండలంలో నీటమునిగి నారుమళ్లు, వరినాట్లు, మెట్టపైర్లు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే తక్షణ సాయమందించాలని మండల జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం బుచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తుఫాన్‌తో నష్టపోయిన రైతాంగం కష్టాలు తెలుసుకునేందుకు తమ పార్టీ అధ్యక్షుడు జిల్లాలో పర్యటించారన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరగా స్పందించకపోవడంతో పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జైకిసాన్‌ నినాదంతో చేపట్టే రా ష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా సోమవారం బుచ్చి మండలంలో రైతాంగానికి ప్రభుత్వం తక్షణ సాయమందించాలని ఈ కార్యక్రమం చేపట్ట్టినట్లు తెలిపారు. ఈ మేరకు తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ముందుగా బుచ్చిలోని జొన్నవాడ సెంటర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద రైతుల సమస్యలపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు ప్రసాద్‌, నాయకులు సునీల్‌, శ్రీను, జయరాం, చైతన్య, సుధీర్‌, సాయితోపాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.---


Updated Date - 2020-12-08T02:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising