ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

60 వేల మందికి ‘జగనన్న తోడు’

ABN, First Publish Date - 2020-11-25T04:50:57+05:30

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న జగనన్న తోడు పథకంలో జిల్లాలోని 60వేల మందికి లబ్ధి చేకూరనుంది.

డీఆర్‌డీఏ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

సున్నా వడ్డీకే రుణం


నెల్లూరు(హరనాథపురం), నవంబరు 24 : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న జగనన్న తోడు పథకంలో జిల్లాలోని 60వేల మందికి లబ్ధి చేకూరనుంది. చిరువ్యాపారుల కోసం నవరత్నాలలో భాగంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రూ.10వేల రుణం అందచేయనున్నారు. వీల్‌కార్టు, సైకిల్‌, మొబైల్‌ వెహికల్‌ సీట్‌ ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లి విక్రయ కార్యకలాపాలను నిర్వహించే వారు, నిర్ధిష్ట ప్రదేశాల్లో విక్రయాలు నిర్వహించే వారు, భుజం మీద లేదా తలపై బుట్టతో విక్రయాలు నిర్వహించే వారు, తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసేవారు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. నెలకు రూ.10వేల లోపు ఆదాయం ఉండి, పది ఎకరాల లోపు భూమి ఉన్నవారు, 300 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగం, ఆదాయపు పన్ను చెల్లించని వారు, నాలుగు చక్రాల వాహనాలు లేని వారై ఉండాలి. సాంప్రదాయ హస్తకళలలో సంప్రదాయ సాంకేతికత లేదా నైపుణ్యాన్ని ఉపయోగించి సంప్రదాయక పదార్థం నుంచి లేదా లేస్‌ వర్క్‌, కలంకారి, ఏటి కొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలు బొమ్మలు, బొబ్బిలి వీనా, ఇత్తడి చేతి పనుల చేసేవారిని కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇలాంటి అన్ని వర్గాల వారితో జిల్లాలోని  చిరు వ్యాపారులను గుర్తించి డీఆర్‌డీఏ అధికారులు సిద్ధం చేసిన జాబితాకు ఆమోద ముద్ర పడింది. ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది.


అర్హులందరికీ జగనన్న తోడు  -నాగలక్ష్మి, పీడీ, డీఆర్‌డీఏ 

జగనన్న తోడు పథకం అర్హులందరికీ అందుతుంది. బుధవారం ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. పథకం ప్రారంభం అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. 

Updated Date - 2020-11-25T04:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising