ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాన గంధర్వుడి కల నెరవేరేనా ?

ABN, First Publish Date - 2020-09-27T18:02:25+05:30

నెల్లూరు సీమ బిడ్డగా, గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తీరని కోరికగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూలపడ్డ తిక్కన విగ్రహానికి మోక్షమెప్పుడో..?

బాలు చిరకాల వాంఛను నేతలు నెరవేర్చాలి


నెల్లూరు: నెల్లూరు సీమ బిడ్డగా, గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తీరని  కోరికగా సింహపురిలో తిక్క న విగ్రహ ఆవిష్కరణ మిగిలేఉంది. ఈ ప్రయత్నంలో ఆయన నిరంతరం కృషి చేస్తూనే తుదిశ్వాస విడిచారు. నగరంలోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలోని చీకటి గదిలో తిక్కన విగ్రహం మగ్గుతోంది. నాయకుల మధ్య పార్టీల తారతమ్యాలు, అధికారులు నిర్లక్ష్యంతో ఆ విగ్ర హం మూలపడింది. దానికి విముక్తి కలిగించాలని ఎస్పీ బాలు కృషి చేశారు. నిజానికి బాలు కృషితోనే ఆ విగ్ర హం తయారు కావడం, నెల్లూరు రావడం జరిగింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బాలు నెల్లూరులో తిక్కన విగ్రహం ప్రతిష్ఠించాలనే కోరికను అప్పటి శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు చెప్పారు.


వెంటనే సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌ను బుద్ధప్రసాద్‌ పురమాయించారు. ఆ అనుమతులతో ఆ శాఖ విజయవాడలో తిక్కన కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి నెల్లూరుకి పంపింది. ఆ  తరువాత శాసనసభ ఎన్నికలు రావడంతో విగ్రహ ప్రతిష్ఠాస్థాపన ఆగిపోయింది.  ప్రభుత్వం మారటంతో నాయకులు పట్టించుకోలేదు. బాలు చిరకాల వాంఛ నెరవేరేలా ఇకనైనా జిల్లా నాయకులు, అధికారులు కృషి చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.


అంత్యక్రియలకు తరలిన నెల్లూరీయులు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అం త్యక్రియలకు శనివారం నగరం లోని ఆయన బంధుమిత్రులతో పాటు రాయకీయ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ప్రభుత్వం తరపున  రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి పి.అనీల్‌కుమార్‌యాదవ్‌ హాజరై నివాళులర్పించారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి,  వైసీపీ నాయకుడు రూప్‌కుమార్‌యాదవ్‌, బాలు స్నేహితులు తుంగా శివప్రభాతరెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు, చం ద్రశేఖర్‌, విశ్వనాథం, శేషగిరీషం, తదితరులు హాజరయ్యారు. బాలుకి తుది వీడ్కోలు పలికారు.

Updated Date - 2020-09-27T18:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising