ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ

ABN, First Publish Date - 2020-02-23T06:04:28+05:30

దొరవారిసత్రంలోని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం అధికారులు తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం, ఫిబ్రవరి 22: దొరవారిసత్రంలోని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం అధికారులు తనిఖీ చేశారు. నెలబల్లి సొసైటీ కార్యాలయంలో, పాత వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను డీడీఏ (డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆగ్రికల్చర్‌) ఎస్‌ ప్రసాద్‌రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షించారు. మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని, రైతులకు సహకరించడం లేదని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే దొరవారిసత్రం, నెలబల్లిలోని రైతు భరోస కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట సూళ్లూరుపేట ఏడీఏ రాజ్‌కుమార్‌, మండల  ఏవో కాంచన, నెలబల్లి సహకార సంఘ కార్యాలయ ప్రత్యేకాధికారి డీ. మాధవి, సీఈవో గఫూర్‌ పాల్గొన్నారు.


మిల్లర్లపై ఆర్డీవో అగ్రహం

ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి స్థానిక మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చూపడం, అధికారులకు సహకరించకపోవడంపై నాయుడుపేట ఆర్డీవో సరోజిని మిల్లర్లుపై మండిపడ్డారు. శనివారం దొరవారిసత్రంలోని నెలబల్లి సొసైటీ కార్యాలయంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన ఆమె రికార్డులు పరిశీలించారు. సొసైటీ సీఈవో గఫూర్‌ నుంచి వివరాలు తెలుసుకున్న ఆమె వెంటనే కొంత మంది మిల్లర్లుతో మాట్లాడి రైతులకు సహాయ పడాలని కోరారు. ప్రభుత్వ కార్యాక్రమాలకు సహకరించకపోతే  తగిన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆమె వెంట స్థానిక తహసీల్దారు పద్మావతి, సివిల్‌ సఫ్లైయ్స్‌ డిప్యూటీ తహసీల్దారు  సంధ్యారాణి, సంధీ్‌పకుమార్‌, ఆర్‌ఐ రమాదేవి, తదితరులు ఉన్నారు.   

Updated Date - 2020-02-23T06:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising