ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు అన్యాయం జరిగింది!

ABN, First Publish Date - 2020-07-04T10:40:33+05:30

ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హుల పేర్లు చేర్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైసీపీ నాయకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలువాయిలో వైసీపీ నాయకుల ధర్నా

నిలిచిపోయిన ప్లాట్ల కేటాయింపు


కలువాయి, జూన్‌ 3 : ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హుల పేర్లు చేర్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైసీపీ నాయకుడు అనిల్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కలువాయిలో లేఔట్ల వద్ద గ్రామస్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కలువాయిలో ఐదు లేఅవుట్లు వేసిన అధికారులు, ఎంపిక చేసిన 366 మంది జాబితాను ప్రకటించారు. లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించేందుకు శుక్రవారం వారందరినీ లేఅవుట్‌ వద్దకు పిలిపించారు.


ఇంతలో వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని జాబితాలో చాలా మంది అనర్హుల పేర్లు చేర్చడంతోపాటు, అర్హులైన వారి పేర్లను తొలగించారంటూ అధికారులను ప్రశ్నించారు. అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 12 వేల మంది జనాభా కలిగిన కలువాయిలో అధికారులు కేవలం 366 మందిని మాత్రమే ఎంపిక చేశారని, ఇందులో కూడా అనర్హులు ఉన్నారని ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించినపుడు 850 మందిని అర్హులుగా గుర్తించగా, తుది జాబితాకు 366 మందిని మాత్రమే ఎంపిక చేశారని, దీంతో అర్హులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దీంతో పాట్ల కేటాయింపును నిలిపివేసిన ఇన్‌చార్జి తహసీల్దారు శ్యాంసుందర్‌ రాజు  వీఆర్వోలతో మళ్లీ విచారణ చేయించి, కొత్త జాబితా తయారు చేయిస్తామని ప్రకటించారు. 

Updated Date - 2020-07-04T10:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising