ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లు అమ్మకాలు చేసినా..సేవించినా జైలుపాలే

ABN, First Publish Date - 2020-03-27T05:58:30+05:30

కల్లు అమ్మకాలు చేసినా, సేవించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ అబ్దుల్‌ జలీల్‌


నాయుడుపేట, మార్చి 26 : కల్లు అమ్మకాలు చేసినా, సేవించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ అబ్దుల్‌ జలీల్‌ అన్నారు. నాయుడుపేట ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సర్కిల్‌ పరిధిలో గురువారం ఎస్‌ఐ శేషమ్మ, సిబ్బందితో కలిసి ఆయన తనిఖీ చేపట్టారు. మండలంలోని అరవపెరిమిడి,  పుదూరు, జువ్వలపాళెం, ఓజిలి మండలంలో ఓజిలి, సగుటూరువడ్డికండ్రిగ, కురుగొండ, నెమళ్లపూడి, ఆరిమేనిపాడు, పెద్దపరియ గ్రామాల్లో గీత కార్మికులకు, గ్రామస్థులకు కొవిడ్‌-19 వైరస్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సగుటూరువడ్డికండ్రిగలో కల్లు అమ్ముతున్న గురవయ్యను, 7 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నెమళ్లపూడిలో కల్లు అమ్ముతున్న రామారావును, 5 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సిబ్బంది రాజయ్య, భాస్కర్‌రావు, రవి ఉన్నారు. 

Updated Date - 2020-03-27T05:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising