ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పన్ను స్వాహా

ABN, First Publish Date - 2020-11-10T04:12:02+05:30

ముదివర్తిలో ప్రభుత్వ స్థలానికి ఎన్‌వోసీ, పంచాయతీ పన్నులను సొంతానికి వాడుకున్నాడన్న అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వెలుగులోకి అలగానిపాడు కార్యదర్శి లీలలు

నిజం నిగ్గుతేలినా చర్యలు శూన్యం

నిజం నిగ్గుతేలినా చర్యలు శూన్యం

 నిజం నిగ్గుతేలినా చర్యలు శూన్యం


విడవలూరు, నవంబరు 9: ముదివర్తిలో ప్రభుత్వ స్థలానికి ఎన్‌వోసీ, పంచాయతీ పన్నులను సొంతానికి వాడుకున్నాడన్న అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అలగానిపాడు పంచాయతీ కార్యదర్శి ఎస్‌.కె. షరీఫ్‌ అవినీతి లీలలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ పన్నులకు సంబంధించి రెండు రసీదు పుస్తకాలను (ఒకటి ప్రభుత్వం జారీ చేసిన పుస్తకం, రెండోది నకిలీ పుస్తకం) ఏర్పాటు చేసుకుని అలగానిపాడు, ముదివర్తి పంచాయతీల్లో ప్రజలు చెల్లించిన ఇంటి పన్నును  కార్యదర్శి షరీఫ్‌ స్వాహా చేశాడని మండలంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఈ రెండు పంచాయతీల్లో సుమారు  రూ.3లక్షలకు మేర అవినీతికి పాల్పడినట్లు సమాచారం. 

 అధారాలు ఇవిగో..

 ఈ ఏడాది అగస్టు నుంచి సెప్టెంబరు వరకు ముదివర్తికి ఇన్‌చార్జి కార్యదర్శిగా పని చేసిన షరీప్‌కు ఆగస్టు 17, 25న గ్రామానికి చెందిన తూళ్లూరు మాధవి రూ.2508(రసీదు నెం 1905) పుట్టా శైలజ రూ.225 (రసీదు నెం 1907), గున్నం కేతురమ్మ  రూ. 265 (రసీదు నెం 1906) ఇంటి పన్నులను చెల్లించారు. అయితే ఆయన ఆ పన్నులను 7  రోజుల్లో ట్రెజరీకి జమ చేయాల్సివుండగా అలా చెల్లించకుండా సొంతానికి వాడుకున్నాడు. ఇలా పలువురి వద్ద పన్నులు వసూలు చేసి స్వాహా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

 చర్యలు శూన్యం


అలగానిపాడులో చేపల గుంతలకు నాలుగేళ్లు వేలం పాటలు నిర్వహించకుండా ఆ గుంతలను అనఽధికారికంగా ఇతరులకు లీజుకి ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయంపై గ్రామ ప్రజలు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇవ్వటంతో విచారణ జరిపిన ఈవోపీఆర్డీ సాయిప్రసాద్‌ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపారు. అనంతరం చేపల గుంతలకు వేలం పాటలను నిర్వహించారు. ఇటీవల ముదివర్తికి ఇన్‌చార్జిగా ఉన్న షరీష్‌పై ఎన్‌వోసీల జారీ, పంచాయతీ పన్నుల స్వాహాపై ఫిర్యాదులు అందటంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామంలో విచారణ జరిపారు. ఆ విచారణలో పంచాయతీ కార్యదర్శి తప్పిదాలు బహిర్గతమయ్యాయి. అయినా ఆయనపై ఇంతవరకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవంపట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 


విచారణ జరుపుతాం

ముదివర్తిలో పన్నులు వసూలు చేసి ట్రెజరీకి  కట్టలేదన్న వ్యవహరంపై ఇప్పటికే డీఎల్‌పీవో రమేష్‌ విచారణ జరిపారు.  షరీఫ్‌పై వచ్చిన మిగతా ఆరోపణలపై కూడా విచారణ జరుపుతాం.

-సాయిప్రసాద్‌, ఈవోపీఆర్డీ విడవలూరు


Updated Date - 2020-11-10T04:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising