ఇళ్ల స్థలాల కేటాయింపులో గందరగోళం!
ABN, First Publish Date - 2020-12-30T04:00:20+05:30
మండలంలో జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీలో గందరగోళం నెలకొంది. రాజకీయ నాయకుల జ్యోక్యంతో అర్హులకు స్థలం దక్కకపోటా అనర్హులకు స్థలాలు కేటాయించారు.
అధికారులను నిలదీస్తున్న లబ్ధిదారులు
మర్రిపాడు, డిసెంబరు 29: మండలంలో జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీలో గందరగోళం నెలకొంది. రాజకీయ నాయకుల జ్యోక్యంతో అర్హులకు స్థలం దక్కకపోటా అనర్హులకు స్థలాలు కేటాయించారు. దీంతో లబ్ధిదారులు అధికారులను నిలదీస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా వసతులు లేని ప్రదేశాల్లో స్థలాలు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నందవరంలో మహిళలు నిరసన తెలపగా జాయింట్ కలెక్టరు స్వయంగా వచ్చి పరిశీలించారు. అలాగే పెగళ్లపాడుంలో యానాదులకు స్థలాలు కేటాయించకుండా అనర్హులకు చోటు కల్పించారని అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పొంగూరులో ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారికే పట్టాలు పంపిణీ చేయాలని లబ్ధిదారులు గతంలోనే అధికారులను నిలదీయడంతో పంపిణీ నిలిచిపోయింది. అయితే అనర్హులకు చోటు కల్పించామనేది వాస్తవం కాదని, పెగళ్లపాడులోని ఎస్టీలకు తప్పక న్యాయం చేస్తామని తహసీల్దారు అబ్దుల్ హమీద్ పేర్కొన్నారు.
Updated Date - 2020-12-30T04:00:20+05:30 IST