ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులతో సమానంగా హోంగార్డుల సేవలు

ABN, First Publish Date - 2020-12-07T04:48:21+05:30

పోలీసులతో సమానంగా హోం గార్డులు అన్ని రకాల సేవలను జిల్లా ప్రజలకు అందిస్తున్నారని, పోలీసు శాఖకు వెన్నెముకలా హోంగార్డుల సేవలు నిలిచి పోతున్నాయని ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ కొనియాడారు.

పావురాలను వదిలి వేడుకలను ప్రారంభిస్తున్న ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌


నెల్లూరు(క్రైం), డిసెంబరు 6: పోలీసులతో సమానంగా హోం గార్డులు అన్ని రకాల సేవలను జిల్లా ప్రజలకు అందిస్తున్నారని, పోలీసు శాఖకు వెన్నెముకలా హోంగార్డుల సేవలు నిలిచి పోతున్నాయని ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ కొనియాడారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర హాల్‌లో ఆదివారం హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ పావురాలను, హైడ్రోజన్‌ బెలూన్లను ఆకాశంలోకి వదిలి పోలీసు బ్యాండ్‌ మేళతాళాలతో గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు నీతి నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం నగరంలో హోంగార్డులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పీ వెంకటరత్నం, డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, గాంధీ, పీ శ్రీనివాసరావు, హోంగార్డ్స్‌ ఆర్‌ఐ పాల్‌రాజ్‌, పీఆర్వో శ్రీకాంత్‌, హోంగార్డుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కే  రవిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T04:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising