రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ABN, First Publish Date - 2020-12-06T02:58:45+05:30
నివర్ తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఇటీవల పార్లమెంట్‌లో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని స్త్రీ విముక్తి సంఘటన, నవయువ సమాఖ్య, ఏఐఎ్‌ఫటీయూ, పీడీఎ్‌సయూల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
కావలిటౌన్, డిసెంబరు 5: నివర్ తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఇటీవల పార్లమెంట్‌లో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని స్త్రీ విముక్తి సంఘటన, నవయువ సమాఖ్య, ఏఐఎ్‌ఫటీయూ, పీడీఎ్‌సయూల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వక్తలు మాట్లడుతూ తుఫాన్‌కు వేలాది ఎకరాలు పంట నష్టం జరిగిందని, ఆక్వా రైతులు నష్టపోయారని, మత్సకారులు పడవలు వలలు కోల్పోయారని వారికి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ర్తీ విముక్తి సంఘటన జిల్లా నయకురాలు శ్యామల, నవయువ సమాఖ్య నేత వీ మురళి, ఏఐఎ్‌ఫటీయూ, పీడీఎ్‌సయూ నేతలు లక్ష్మీరెడ్డి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-06T02:58:45+05:30 IST