అధికలోడ్‌తో ఇరుక్కున్న లారీ
ABN, First Publish Date - 2020-12-12T04:53:13+05:30
అధికలోడ్‌తో వెళ్తున్న లారీ మలుపు వద్ద ఇరుక్కుపోవడంతో దాదాపు 2 గంటల సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
క్రమబద్ధీకరించిన పోలీసులు
నాయుడుపేట టౌన్, డిసెంబరు 11 : అధికలోడ్‌తో వెళ్తున్న లారీ మలుపు వద్ద ఇరుక్కుపోవడంతో దాదాపు 2 గంటల సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసుల కథనం మేరకు శుక్రవారం తెల్లవారుజామున మేనకూరు సెజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కర్మాగారం నుంచి తయారైన ట్రాన్మఫార్మర్ల స్టాండ్ మెటీరియల్‌తో ఓ ట్రక్‌లారీ చెన్నై హార్బర్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో నాయుడుపేట నుంచి ప్రధాన రహదారిలో కలిసే మలుపు (గోమతిసెంటర్) వద్ద ఇరుక్కుపోయింది. అటు తిరుపతి నుంచి వచ్చే, ఇటు నెల్లూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్‌ఐ బాలకృష్ణ రెండు క్రేన్‌లు, రెండు ఎక్స్‌వేటర్లను తెప్పించారు. అవి అతి కష్టంమీద లారీని రోడ్డు పక్కన పెట్టాయి. దీంతో ట్రాఫిక్‌ను నెమ్మదిగా క్రమబద్ధీకరించారు.
Updated Date - 2020-12-12T04:53:13+05:30 IST