ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

77 జీవోను రద్దు చేయకపోతే ప్రభుత్వమే రద్దు

ABN, First Publish Date - 2020-12-30T05:13:40+05:30

జీవో నెంబరు 77ను రద్దు చేయకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని విద్యార్థులు రద్దుచేస్తారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌ హెచ్చరించారు.

ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏబీవీపీ నిరసన


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 29: జీవో నెంబరు 77ను రద్దు చేయకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని విద్యార్థులు రద్దుచేస్తారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌ హెచ్చరించారు. జీవో నెంబరు 77ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్‌లో ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు చదివే విద్యార్థుల కోసం జీవో నెంబరు 115 తెచ్చిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు జీవో నెంబరు 77ను తీసుకొచ్చి లక్ష మంది విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు.ప్రభుత్వ కళాశాలల్లో చదివే పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు మాత్రమే కళాశాల ఫీజు, వసతి రుసుమును ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కళాశాలలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సాయికృష్ణ, జితేంద్ర, యశ్వంత్‌, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising