ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌ నిఘా!

ABN, First Publish Date - 2020-03-29T11:28:15+05:30

కరోనా వైరస్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌తోపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంది. అత్యవసరమైతేనే ఇల్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాహనాల గుర్తింపులో ఇవే కీలకం

పోలీస్‌ బలగాల మరింత పెంపు

రోడ్లపైకి వస్తే భారీ జరిమానా, వాహనాల సీజ్‌


నెల్లూరు (క్రైం), మార్చి 28 : కరోనా వైరస్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌తోపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంది. అత్యవసరమైతేనే ఇల్లు విడిచి బయటకు రావాలని ప్రజలకు పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు కఠిన నిర్ణయాలకు తీసుకోక తప్పలేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారి వాహనాలను సీజ్‌ చేయడం, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం, భారీగా అపరాధ రుసుము విధిస్తున్నారు. అయినా ప్రజల్లో మార్పు రాకపోవడంతో పోలీసులు మరిన్ని బలగాలను రంగంలోకి దించడంతో పాటు టెక్నాలజీనీ వినియోగించుకుంటున్నారు. రోడ్లపైకి వస్తున్న వారిని సులువుగా గుర్తించేందుకు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. జిల్లాలో పది డ్రోన్‌ కెమెరాలను అందుబాటులో ఉంచారు.


ఈ డ్రోన్‌లను ఆప్‌రేట్‌ చేసేందుకు, వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. రోడ్లపై వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయడం, వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఇక పోలీసు శాఖలో కొన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారు. అయితే ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ఆదేశాలతో సీఐడీ, ఏసీబీ, మెరైన్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగాలకు చెందిన 200 మంది శనివారం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో ఏ ప్రాంతంలో చూసిన పోలీసులే కనిపిస్తున్నారు. 

Updated Date - 2020-03-29T11:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising