ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకుకు బురిడీ

ABN, First Publish Date - 2020-11-14T03:35:33+05:30

ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్నా రానట్టు బ్యాంకు అధికారులను నమ్మించి మళ్లీ అదే మొత్తం జమ చేయించుకుని బురిడీ కొట్టించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటీఎంలో రూ. 20 వేల డ్రా

 రానట్లుగా నమ్మించాడు..

 మళ్లీ బ్యాంకుచే జమ

నాయుడుపేట టౌన్‌, నవంబరు 13 :  ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్నా రానట్టు బ్యాంకు అధికారులను నమ్మించి మళ్లీ అదే మొత్తం జమ చేయించుకుని బురిడీ కొట్టించాడు. ఈ సంఘటన నాయుడుపేటలో ఇటీవల జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంకు ఏటీఎంలో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు ద్వారా రూ 20వేలు డ్రా చేశాడు. నగదు డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అయితే ఆ వ్యక్తి తనకు నగదు డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చిందనీ, నగదు రాలేదనీ బ్యాంకు అధికారిని నమ్మించాడు. దాంతో ఆ అధికారి అతని ఖాతాకు రూ 20వేలు జమచేశారు. వెంటనే ఆ సొమ్మునూ డ్రా చేశాడు. ఇంతలో అతను ఇచ్చిన ఫిర్యాదును బ్యాంకు అధికారులు పరిశీలించగా ఆ వ్యక్తి ఏటీఎం ద్వారా రూ 20 వేలను డ్రా చేసినట్టు నిర్ధారించారు. అతను బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఇదే తరహాలో మూడుసార్లు మోసం జరగడంతో ఆ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శుక్రవారం ఎస్‌ఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. 






Updated Date - 2020-11-14T03:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising