ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ లేఅవుట్లపై విచారణకు సిద్ధమేనా? : కోటంరెడ్డి

ABN, First Publish Date - 2020-08-09T10:57:20+05:30

కావలి పట్టణంలో ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి బినామీలతో వేయించిన అక్రమ లేఅవుట్లపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు 8: కావలి పట్టణంలో ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి బినామీలతో వేయించిన అక్రమ లేఅవుట్లపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరి పించాలని నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శనివా రం ఒక ప్రకటనలో సవాలు విసిరారు. ఆ లేఅవుట్లలో అక్రమాలు లేవని నిరూపిస్తే తాను కావలిలోని మాజీ ఎమ్మెల్యే కలికి యానాది రెడ్డి విగ్రహం వద్ద నీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటానన్నారు. అక్రమాలు ఉన్నట్లు రుజువైతే నీవు ఏమి చెస్తావో ప్రజలకు చెప్పాలన్నారు.


అఖిలపక్ష కమిటీకి ఎవరిని ఆహ్వానిద్దామో చెబుతూ 15 రోజుల్లో విచారణకు సిద్ధం కావాలన్నారు. లేఅవుట్లలో కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలు, గుంటలు, పంట కాలువలు, శ్మశానాలు ఉన్నాయ న్నారు. అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వేస్తుంటే ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌ ఏమి చేస్తేన్నారని ప్రశ్నించారు. కావలి సబ్‌ రిజిష్ట్రార్‌ అక్రమ లేఅవుట్లను రిజిష్టర్‌ చేస్తున్నారని, ఎమ్మెల్యే చెబితే ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు. ఈ అక్రమాల్లో అధికారులకు వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను కొని ప్రజలు నష్టపోతారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేయిస్తే దానిని చూడటానికి వచ్చి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే తనకు నెల్లూరులో పనిలేక కావలికి వచ్చానని ఎమ్మెల్యే తన అనుచరులతో మాట్లాడించడం విడ్డూరమన్నారు. 

Updated Date - 2020-08-09T10:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising