ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం స్వాహాకు యత్నం?

ABN, First Publish Date - 2020-09-29T16:55:21+05:30

ప్రభుత్వ భూముల్లో ఉన్న విద్యుత్‌ టవర్లకు ఫోర్జరీ సంతకాలతో నష్ట పరిహారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోర్జరీ సంతకాలతో రంగం సిద్ధం

పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్‌

మాచవరంలో విద్యుత్‌ టవర్ల వ్యవహారం


నెల్లూరు: ప్రభుత్వ భూముల్లో ఉన్న విద్యుత్‌ టవర్లకు ఫోర్జరీ సంతకాలతో నష్ట పరిహారం పొందేందుకు రంగం సిద్ధమైంది. ఇక విద్యుత్‌ శాఖ అధికారులు చెక్‌ ఇవ్వడమే మిగిలింది. ఇంతలో గ్రామంలోని ఓ వ్యక్తి అధికారులను ఆశ్రయించాడు. టవర్‌కు నష్టపరిహారం పొందేందుకు తనకు కూడా సర్టిఫికెట్‌లు కోరాడు. దీంతో ఈ ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓజిలి మండలంలో ని మాచవరంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.


ఆ భూముల్లో టవర్ల నిర్మాణం

గ్రామంలోని సర్వేనెంబరు 207లో 360 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూములను కొంత మంది అక్రమంగా సాగుచేసుకుంటున్నారు. కాగా మరి కొన్ని భూములను 25 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన పలువురు దళితులకు లీజు పట్టాలు ఇచ్చివున్నారు. కాలక్రమంలో ఇవన్నీ రద్దు అయిపోయాయి. అయితే ఇటీవల ఈ భూముల మీదుగా విద్యుత్‌ లైను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ భూముల్లో టవర్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో వీటిపై కన్నేసిన కొందరు టవర్లు నిర్మాణం జరిగిన పొలం తమదేనంటూ ముందుకు వచ్చారు. విద్యుత్‌ శాఖ అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. దాంతో విద్యుత్‌ శాఖ అధికారులు పొలం ఎవరి పేరుతో ఉందో వారి వివరాలతో కూడిన అసలైన లబ్ధిదారు (జినైన్‌) సర్టిఫికెట్లు దాఖలు చేసుకోవాలని కోరారు.


ఈ క్రమంలో గ్రామంలోని పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డి, దారా పెదపెంచలమ్మ, దారా చినపెంచలమ్మ, గిద్దలూరు పోలమ్మ లు రెవెన్యూ అధికారులను సంప్రదించి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. అయితే ఆ భూములను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇవి ప్రభుత్వ భూములని తేల్చిచెప్పి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.  కాగా లబ్ధిదారులు ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్‌లను తయారు చేసి విద్యుత్‌ అధికారులకు అందజేశారు.  


ఫిర్యాదుతో వెలుగులోకి.. 

ఈ క్రమంలో టవర్ల నిర్మాణం పూర్తయింది.  బాధితుల్లో ముగ్గురికి మాత్రం నష్టపరిహారం ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు.  దాంతో నాలుగో వ్యక్తి తనకు ఎందుకు సర్టిఫికెట్‌ ఇవ్వలేదంటూ తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తహసీల్దారు అనూరాధ విద్యుత్‌ శాఖ అధికారుల వద్ద ఉన్న లబ్ధిదారులు పత్రాలను తెప్పించుకుని పరిశీలించారు.  దీంతో వారికిచ్చిన సర్టిఫికెట్లు ఫోర్జరీగా తేలింది. 


పోలీసులకు ఫిర్యాదు 

ఫోర్జరీ సంతకాలతో ఉన్న లబ్ధిదారుల సర్టిఫికెట్లను పరిశీలించిన తహసీల్దారు అనూరాధ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అంతేకాక ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకువెళతానంటూ ఆమె పేర్కొన్నారు. కాగా ఈ సంఘటనపై రాజకీయ  ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గేది లేదంటూ ఆమె తేల్చిచెప్పారు. 


Updated Date - 2020-09-29T16:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising