ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్తుకూరులో ఫిషింగ్‌ జెట్టీ : కాకాణి

ABN, First Publish Date - 2020-12-04T04:55:15+05:30

సర్వేపల్లి నియోజకవర్గంలోని మత్స్యకారుల కోసం ముత్తుకూరులో ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటుకు మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు.

మంత్రితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి, మత్స్యకార నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 3 : సర్వేపల్లి నియోజకవర్గంలోని మత్స్యకారుల కోసం ముత్తుకూరులో ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటుకు మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. మత్స్యకారులతో రాష్ట్ర శాసనసభ ఆవరణలో మంత్రి అప్పలరాజుతో ఆయన గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మత్స్యకారులకు మినీ ఫిషింగ్‌ హార్బర్‌ మంజూరైనప్పటికీ నిర్మాణం జరగలేదని తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఫిషింగ్‌ హార్బర్‌ కంటే ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని మంత్రిని కోరారు.  దీనికి మంత్రి స్పందిస్తూ ముత్తుకూరు మండలంలో పోర్టు ప్రాంతంలో ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముత్తుకూరు మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్దన్‌రెడ్డి, మత్స్యకార నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising