ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరో వర్గం.. చేపల వేలం!

ABN, First Publish Date - 2020-12-31T05:17:41+05:30

అక్రమ సంపాదన కోసం వైసీపీ నేతలు పోటీపడుతున్నారు.

సచివాలయం వద్ద జరుగుతున్న చేపల వేలంపాట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురంలో వైసీపీ నేతల ఇష్టారాజ్యం

అధికారులకు తెలియకుండానే నిర్వహణ


కావలి, డిసెంబరు 30 : అక్రమ సంపాదన కోసం వైసీపీ నేతలు పోటీపడుతున్నారు. సదరు పార్టీలోని రెండు వర్గాలు పంచాయతీకి చెందిన సాగునీటి చెరువులలో చేపల పెంపకాన్ని మూడు రోజులలో రెండు పర్యాయాలు పోటాపోటీగా ఎవరికి వారు వేలం వేసుకున్న సంఘటన కావలి రూరల్‌ మండలం సిరిపురం పంచాయతీలో జరిగింది. ఈ పంచాయతీలోని సిరిపురం, నారాయణపురం సాగునీటి చెరువులకు వైసీపీ నాయకులు అధికారులకు తెలియకుండానే వేలం వేయడంతో అది వివాదంగా మారింది. గతంలో మత్స్యకార సొసైటీలో ఉన్న ఆ చెరువులను సొసైటీ నుంచి రద్దు చేశారు. దీంతో పదేళ్లుగా ఆ చెరువులకు అధికారికంగా చేపల వేలం నిర్వహించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం చెరువులలోని చేపలను నామమాత్రంగా వేలం వేసి ఆ నిధులను నేతలే చెరువుల తాత్కాలిక మరమ్మతులకు ఖర్చుపెట్టినట్లు తెలిసింది. అయితే అప్పుడు వైసీపీలో ఒకేవర్గం ఉండటం అధికారులు చూసీ చూడనట్లు వదిలివేయడంతో అది వెలుగులోకి రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా అదే పద్ధతిన చెరువులలో చేపలను ఈ నెల 27వ తేదీన వైసీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శికి తెలియకుండానే వేలం పెట్టారు. ఈ వేలంలో రెండు చెరువులకు సుమారు రూ.8 లక్షల వరకు పాట పాడినట్లు తెలిసింది. అయితే టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలో చేరిన మరో నాయకుడు తనకు తెలియకుండా వేలం వేసినందున గ్రామంలో తన రాజకీయ మనుగడ దెబ్బతింటుందని భావించారు. అదే అదునుగా భావించి ఆయన కూడా అధికారులకు తెలియకుండా మరలా బుధవారం చేపల వేలం పాటను పెట్టారు. ఈ వేలం పాటలో రెండు చెరువులను సుమారు రూ.8లక్షలకు పాట పాడినట్లు తెలిసింది. ఇది గ్రామంలో చర్చనీయాంశంగా మారి వైసీపీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు చోటు చేసుకోవడమేగాక అధికారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చేపల వేలం విషయం తమకు తెలియదని చెప్పారు. ఈ విషయమై ఇరిగేషన్‌ ఏఈ కిరణ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ చేపల పెంపకం వేలం పాట తమకు సంబంధించింది కాదని అన్నారు. కావలి ఎమ్పీడీవో సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లగా వేలం విషయమే తనకు తెలియదని దీనిపై విచారిస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి లావణ్య దృష్టికి తీసుకెళ్లగా ఆ వేలం పంచాయతీకి సంబంధం లేదని, అధికారకంగా జరగలేదని, తాను లేని సమయంలో వేలం వేశారని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో త్వరలో అధికారికంగా వేలం పాటలు నిర్వహిస్తానని చెప్పారు. 

Updated Date - 2020-12-31T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising