ఎఫ్‌డీవోలుగా 33 మంది మత్స్యపట్టభద్రులు
ABN, First Publish Date - 2020-12-06T03:18:58+05:30
మత్స్యకళాశాల నుంచి ఈ ఏడాది బీఎఫ్‌ఎస్సీ పట్టభద్రులైన 33 మందికి రాష్ట్రంలో ఎఫ్‌డీవో ఉద్యోగాలు పొందారని కళాశాల అసోసియేట్ డీన్
ముత్తుకూరు, డిసెంబరు5: మత్స్యకళాశాల నుంచి ఈ ఏడాది బీఎఫ్‌ఎస్సీ పట్టభద్రులైన 33 మందికి రాష్ట్రంలో ఎఫ్‌డీవో ఉద్యోగాలు పొందారని కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ రవీంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. మత్స్యకళాశాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2012 తర్వాత ఇంత పెద్దఎత్తున మత్స్యకళాశాల విద్యార్ధులు ఎఫ్‌డీవో ఉద్యోగాలు పొందారన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఎంఎఫ్‌ఎస్సీ కోసం నిర్వహించిన ఐసీఏఆర్ జేఆర్‌ఎఫ్ అర్హత పరీక్షలో తమ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ చూపి, దేశంలోని పలు యూనివర్సిటీల్లో సీట్లు సాధించారని తెలిపారు. ఐసీఏఆర్ అర్హత పరీక్షలో ర్యాం కులు సాధించిన పట్టభద్రులు భార్గవి, పి.సాయికృష్ణ, సూర్యతే జ, వి.సాయికృష్ణ, ప్రియాంక, కార్తీక్, రవికిరణ్, విజయ్‌కు మార్‌లను ఆయన అభినందించారు. అఖిల భారత స్థాయిలో ఆన్‌లైన్ రాత పరీక్షల్లో ప్రథమస్థానంతో పాటు, జాతీయ స్థాయి ఆన్‌లైన్ వ్యాసరచన పోటీల్లో బహుమతులు సాధించిన బీఎఫ్‌ఎస్సీ మూడవ సంవత్సరం విద్యార్థిని జుమైమాకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. -----------
Updated Date - 2020-12-06T03:18:58+05:30 IST