ఈయూ ఇకపై ఏపీపీటీడీ ఈయూ
ABN, First Publish Date - 2020-12-12T04:35:41+05:30
ఈయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాపూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు.
వేడుక చేసుకుంటున్న ఉద్యోగులు
ఆవిర్భావ దినోత్సవాల్లో నాయకులు
రాపూరు, డిసెంబరు 11: ఈయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాపూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ, కార్మికుల కోసం యూనియన్ చేసిన సేవలను మననం చేసుకున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడం కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం తమ యూనియన్ ఘనతేనన్నారు. ఈయూను ఇకపై ఏపీపీటీడీ ఈయూగా మార్చినట్లు తెలిపారు. రీజనల్ కార్యదర్శి ప్రసాద్, డిపో నాయకులు నిస్సార్ అహ్మద్, రామూర్తినాయుడు, ఆదిశేషయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:35:41+05:30 IST