ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్‌కు ఉద్యోగాలివ్వాలి

ABN, First Publish Date - 2020-12-21T04:48:05+05:30

డీఎస్సీ- 98 క్వాలిఫైడ్‌ నిరుద్యోగులకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న చండ్ర రాజగోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 20 : డీఎస్సీ- 98 క్వాలిఫైడ్‌ నిరుద్యోగులకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో డీఎస్సీ- 98 క్వాలిఫైడ్‌ నిరు ద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు తాము మద్దతు తెలుపుతున్నామని, వారి నాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. క్వాలిఫైడ్స్‌ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాటుబోయిన శ్రీనివాసులు, రాఘవేంద్ర మాట్లాడుతూ 22 ఏళ్లుగా ఉద్యోగాల కోసం పోరాడుతున్నామన్నారు. కోర్టులు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలివ్వాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు గౌస్‌, ఫరూక్‌, శ్రీనివాసులు, చంద్రమోహన్‌, శ్రీరాములు, లలిత తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-21T04:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising