ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు దారుణం

ABN, First Publish Date - 2020-10-19T06:07:58+05:30

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణల తీరు దారుణమని, దీన్ని ప్రతి రైతు ప్రతిఘటించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులు ప్రతిఘటించాలి

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 18 : రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణల తీరు దారుణమని, దీన్ని ప్రతి రైతు ప్రతిఘటించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.  నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్‌ విధానాలను తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వాగతించటం సరికాదన్నారు. పొలాలకు విద్యుత్‌ మీటర్లు బిగించటం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 22ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం అప్పుగా ఇస్తానని చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని సూచించారు.  

Updated Date - 2020-10-19T06:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising