16న విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల ర్యాలీ
ABN, First Publish Date - 2020-11-14T04:08:19+05:30
విద్యుత్‌శాఖలో కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న నెల్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బాబ్జి, సుమన్ కోరారు.
నెల్లూరు(జడ్పీ), నవంబరు 13 : విద్యుత్‌శాఖలో కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న నెల్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బాబ్జి, సుమన్ కోరారు. నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట జరుగుతున్న రిలే దీక్షల్లో శుక్రవారం వారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల ఆందోళనను సంస్థ యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిరసన తెలిసిన జేఏసీ నేతలను అరెస్ట్ చేయడం అమానుషమన్నారు.
Updated Date - 2020-11-14T04:08:19+05:30 IST