ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు రక్షణ కరువు

ABN, First Publish Date - 2020-06-03T11:08:39+05:30

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు


నెల్లూరు (వీఆర్సీ), జూన్‌ 2 : రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారని, సంకెళ్లకు తాము భయపడమని దళిత నేతలు పేర్కొన్నారు. నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ నెల్లూరులోని అంబేద్కర్‌ భవన్‌లో మంగళవారం ఎస్సీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకట రమణ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు.


కోవిడ్‌-19 విధుల్లో ఉన్న వారికి మాస్క్‌లు కావాలని అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు పంటలు పండే దళితుల  భూములను లాక్కుని ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై మండిపడ్డారు. అమెరికాలో జాత్యహంకారంతో పోలీసులు హత్య చేస్తే పరిణామాలు ఎలా ఉన్నాయో ప్రపంచమంతా చూస్తోందని, అలాగే దళితులకు అన్యాయం చేసి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు బద్దెపూడి రవీంద్ర, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాబు, పల్లం వెంకయ్య, దార్ల సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T11:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising