మద్యంషాపులు వద్దు
ABN, First Publish Date - 2020-05-09T08:38:05+05:30
లాక్‌డౌన్ సమయంలో మద్యంషాపులను తెరవడం మంచిదికాదని మాజీమంత్రి పరసారత్నం ప్రభుత్వానికి
తహసీల్దారుకు మాజీమంత్రి పరసా వినతి
సూళ్లూరుపేట, మే 8 : లాక్‌డౌన్ సమయంలో మద్యంషాపులను తెరవడం మంచిదికాదని మాజీమంత్రి పరసారత్నం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమేరకు స్థానిక తహసీల్దారు హమీద్‌కు వినతిపత్రం అందజేశారు. నిత్యావసర సరుకులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సమయమిచ్చి మద్యం దుకాణాలకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం వ్యాపార దృక్పథానికి నిదర్శనమన్నారు. మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించకపోవడంతో కరోనా విజృంభిస్తుందని, పేదలు ఇళ్లల్లో గొడవలు రేగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-05-09T08:38:05+05:30 IST