ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు

ABN, First Publish Date - 2020-02-20T09:49:05+05:30

చదువులో మొదటి ర్యాంకు కోసం పిల్లలపై ఒత్తిడి తేవద్దని వారిలో ఉన్న సృజన వెలికి తీయాలని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ హైమావతి


నెల్లూరు (వీఆర్సీ) ఫిబ్రవరి 19 : చదువులో మొదటి ర్యాంకు కోసం పిల్లలపై ఒత్తిడి తేవద్దని వారిలో ఉన్న సృజన వెలికి తీయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జీ హైమావతి పేర్కొన్నారు. నగరంలోని రహదారులు, భవనాల అతిథి గృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 6-14 మధ్య వయస్సున్న విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అందించాలన్నారు. 14-18 మధ్య వయస్సున్న వారికి నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రభుత్వం చర్చలు తీసుకుంటోందన్నారు. పిల్లల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని వారిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలన్నారు. ఇలాంటి వారి కోసమే ఆనంద వేదిక మొదటి పీరియడ్‌లో నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఆమె నగరంలోని మద్రాసు బస్టాండు వద్దగల బాలికల వసతిగృహాలను పరిశీలించారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యురాలు పద్మలత, సెట్నెల్‌ సీఈవో సుస్మితారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising