ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడులో జిల్లా నాయకులు

ABN, First Publish Date - 2020-05-28T11:05:21+05:30

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బుధవారం మొదలైంది. కరోనా విపత్తు నేపథ్యంలో ఈ ఏడాది ఆన్‌లైన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జూమ్‌ యాప్‌ ద్వారా ఇళ్ల నుంచే హాజరు

నెల్లూరు, మే 27 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బుధవారం మొదలైంది. కరోనా విపత్తు నేపథ్యంలో ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానంలో జూమ్‌ యాప్‌ ద్వారా ఇళ్ల వద్ద నుంచే జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి నుంచి అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తొలి రోజు ‘అన్నదాత నడ్డివిరిచిన ప్రభుత్వం’ తీర్మానాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. తొలిరోజే ‘అక్రమ కేసులు - ఆస్తుల విధ్వంసం’ తీర్మానాన్ని మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ సమయాభావం వల్ల రెండో రోజు గురువారం ఉదయానికి వాయిదా వేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మనోహర్‌రెడ్డి, ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌, తిరుమల నాయుడు, అమృల్లా తదితరులు పాల్గొన్నారు. తన ఇంటి వద్ద నుంచే జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు పాల్గొన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలను గురువారం నెల్లూరులోని మూలాపేట అలంకార్‌ సెంటర్లో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-05-28T11:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising