ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్ధులకు పౌష్టికాహారం పంపిణీ

ABN, First Publish Date - 2020-08-05T11:28:59+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈనెల 26వతేదీ వరకు రెండు విడతల్లో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(విద్య), ఆగస్టు 4 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈనెల 26వతేదీ వరకు రెండు విడతల్లో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వతేదీ వరకు 1 నుంచి 5వతరగతి వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి 4 కేజీల బియ్యం, 6 నుంచి 10 తరగతులకు వారికి 6 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. అయితే ఆ సమయంలో గుడ్లు, చిక్కీల టెండర్లు ఖరారు కాకపోవడంతో వీటిని నిలిపివేశారు. తాజాగా వీటికి అనుమతులు రావడంతో మంగళవారం నుంచి 13వతేదీ వరకు, 14 నుంచి 26వతేదీ వరకు రెండు విడతల్లో గుడ్లు, చిక్కీలతో కలిపి పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి 14 గుడ్లు, 10 చిక్కీలను వలంటీర్లు అందజేస్తారని, జిల్లాలోని 2,16,320 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

Updated Date - 2020-08-05T11:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising