ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని జింక మృతి

ABN, First Publish Date - 2020-12-06T03:08:59+05:30

వెంకటాచలం రైల్వే స్టేషన్‌ సమీపంలో సర్వేపల్లి మార్గంలో శనివారం కారు ఢీకొని జింక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, వెంకటాచలం

జింక కళేబరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వాహనంపై  చర్యలు శూన్యం

వెంకటాచలం, డిసెంబరు 5 : వెంకటాచలం రైల్వే  స్టేషన్‌ సమీపంలో సర్వేపల్లి మార్గంలో శనివారం కారు ఢీకొని జింక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, వెంకటాచలం నుంచి ఇస్కపాళెం వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న జింకను ఢీకొంది. దీంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కారు అతివేగంగా రావడం వల్లే జింక అక్కడికక్కడే మృతి చెందిందని అటుగా వెళ్తున్న పలువురు వాహనచోదకులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనంపై అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

-------


Updated Date - 2020-12-06T03:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising