ఉదయం నరక చతుర్దశి.. సాయంత్రం దీపావళి
ABN, First Publish Date - 2020-11-14T04:29:08+05:30
ఈ ఏడాది నరక చతుర్దశి, దీపావళి పండుగలు ఒకేరోజు వచ్చాయి.
రెండు పండుగలు ఒకే రోజు
రేపు కార్తీక మాసం ప్రారంభం
నెల్లూరు(సాంస్కృతికం), నవంబరు 13 : ఈ ఏడాది నరక చతుర్దశి, దీపావళి పండుగలు ఒకేరోజు వచ్చాయి. ఆ రెండు వేడుకలను శనివారం జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా మహిళలు, ముత్తైదువులు కేదారేశ్వర వ్రతాన్ని శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ మేరకు భక్తుల కోసం శివాలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది మిగిలిన పండుగల్లాగే దీపావళికి కూడా హంగామా కనిపించడం లేదు. దీనికితోడు దీపాలు వెలిగించుకునే ప్రమిదలు మొదలు పూజా సామగ్రి, గుమ్మడికాయ, టపాకాయల వరకు ధరలు పెరగడంతో ప్రజలు ఉసూరుమంటున్నారు. కాగా, దీపావళి మరుసటి రోజు అనగా ఆదివారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది. ఈ మాసంలో నోములు, అయ్యప్పదీక్షలు, మండల పూజలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ కనిపించబోతోంది
Updated Date - 2020-11-14T04:29:08+05:30 IST